తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న 83,812 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 38,345 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్యూలైన్లలో మంచినీరు, పాలు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


