TG: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఇతర రాష్ట్రాల భక్తులు సైతం శ్రీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 4 గంటలకు పైగా.. (వీఐపీ) రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 90 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదగిరీశుడికి నిత్యాదాయం రూ.73,75,642 వచ్చినట్లు తెలిపారు.
భక్తి
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి


