హైదరాబాద్: 28°C
వార్తలు

'SMలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు'

ఎన్టీఆర్: విజయవాడలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన పోస్టులు లేదా కామెంట్లను చేయడం తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు.