హైదరాబాద్: 28°C
క్రీడలు

యూఎస్ అధికారుల అదుపులో ఫుట్‌బాల్ స్ట్రైకర్..!

ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ కోసం అమెరికాకు వచ్చిన ఇరాక్ స్ట్రైకర్ అయెమెన్ హుస్సేన్‌ను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాదాపు ఏడు గంటలపాటు విచారించిన తర్వాత అతడిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇరాకీ ఫుట్‌బాల్ అసోసియేషన్ గానీ.. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.