ADB: జిల్లావ్యాప్తంగా పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ నేరాల నియంత్రణకు కృషిచేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం భీంపూర్ మండలంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు సమీపంలో ఉన్న గ్రామాల నుంచి అక్రమ మద్యం రవాణా కాకుండా చూడాలని ఆదేశించారు.
వార్తలు
నేరాల నియంత్రణకు కృషి చేయాలి: SP


