హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్‌పై చిత్తూరు పోలీసుల ఉక్కుపాదం

CTR: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 20 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి, డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో 70 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురు మాదకద్రవ్యాలు వినియోగించినట్లు గుర్తించారు. కార్వేటినగరం మండలంలో 450 లీటర్ల సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.