కృష్ణా: ఈనెల 14న మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఘంటసాల కళా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఘంటసాల కృష్ణమోహన్, పోతన వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. మధుర గాయకుని వంశ జన్మశాలైన కృష్ణాజిల్లాలోని ఘంటసాల గ్రామంలో 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
14న ఘంటసాల పాటల పోటీలు నిర్వహణ


