హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు..?

మరోసారి మొబైల్‌ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాబోయే 3 - 6 నెలల్లో రీఛార్జ్ ధరలు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా వెల్లడించారు. ఒకవేళ టారిఫ్స్ పెరిగితే.. ప్రస్తుతం ఉన్న రూ.299 ప్లాన్ ధర రూ.329కి, రూ.349 ప్లాన్ ధర రూ.384కు చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే వినియోగదారులకు భారీ షాక్‌ తప్పదనే చెప్పాలి.