హైదరాబాద్: 28°C
వ్యాపారం

షేరు పతనం.. ఇరుక్కున్న LIC, రిటైల్ మదుపర్లు

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఉదంతంతో మదుపర్లు భారీగా నష్టపోయారు. 2023 ఫిబ్రవరిలో రూ.1,028 వద్ద ఉన్న ఈ షేరు ధర, తాజాగా లోయర్‌ సర్క్యూట్‌ తాకి రూ.104.65కు పడిపోయింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3,089 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం LICకి 10.8% వాటా ఉండగా, సుమారు 1.94 లక్షల మంది రిటైల్ మదుపర్లకు 14.13% వాటాలున్నాయి.