GNTR: ఈ ఏడాది డిసెంబర్ రెండవ వారంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో, జిల్లాల డీఈఓలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీఈఓ జ్యోతిబసు, డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ పాల్గొన్నారు.