హైదరాబాద్: 28°C
తెలంగాణ

బురదమయంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంగణం

GDWL: గద్వాల మండలం పరమాల శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బ్లాక్-1, 2లో పైపుల లీకేజీతో నీరు నిల్వ ఉండి పరిసరాలు బురదమయంగా మారాయి. దోమలు ప్రబలి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీలు అరికట్టి పరిసరాలు శుభ్రం చేయించాలని కోరుతున్నారు.