TG: ధర్మపురి అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం జలాల విషయంలో కరీంనగర్ జిల్లాకు జరిగిన అన్యాయంపై చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి చర్చకు తేదీ, స్థలం ఖరారు చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కొప్పుల అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
వార్తలు
BRSకు మంత్రి అడ్లూరి బహిరంగ సవాల్


