హైదరాబాద్: 28°C
వార్తలు

పప్పుధాన్యాల ధరలకు రెక్కలు

సరఫరా కొరత కారణంగా గత ఏడాదిలో పప్పుధాన్యాల ధరలు 19 శాతం వరకు పెరిగాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. కందిపప్పు 19 శాతం పెరిగి కిలో రూ.136.60కు చేరింది. మినుము 12 శాతం పెరిగి రూ.127కు, శనగపప్పు 11 శాతం పెరిగి రూ.95.45కు చేరాయి. మహానగరాల్లో కిలో కంది రూ.157 వరకు విక్రయిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల కంది దిగుబడి తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు.