SRCL: కోనరావుపేట మండలం కొలనూరులో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా తొలిరోజు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు.
తెలంగాణ
కొలనూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ


