హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జల్లూరు కౌంటింగ్ వద్ద కార్యకర్తల ఘర్షణ

KKD: పిఠాపురం మండలం జల్లూరులో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. కొందరు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.