హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఏకగ్రీవాల పర్వం

శ్రీకాకుళం జిల్లాలో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది. మొత్తం 342 పంచాయతీలకు గాను 39 చోట్ల సర్పంచులు, 2,527 వార్డుల్లో 128 చోట్ల వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బూర్జ, మెళియాపుట్టిలో 7 చొప్పున సర్పంచులు ఏకగ్రీవం కాగా, ఆమదాలవలస, జి.సిగడం, కొత్తూరులో 4 చొప్పున నమోదయ్యాయి. వార్డుల్లో జి.సిగడం 23తో అగ్రస్థానంలో నిలవగా, పొందూరు 17తో రెండో స్థానంలో ఉంది.