హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రీకౌంటింగ్‌లు.. మూడు ఓట్ల విజయం!

కోనసీమ: అంబాజీపేట మండలం ఇరుసుమండ సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. అతి స్వల్ప ఓట్ల తేడా రావడంతో అధికారులు మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. అనంతరం 3 ఓట్ల మెజారిటీతో కోట హనుమంతురావు విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.