హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొప్పేడులో ఉద్రిక్త పరిస్థితులు

CTR: నిండ్ర మండలం కొప్పేడు గ్రామపంచాయతీలో వార్డు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ రెండు వార్డులు, వైఎస్సార్‌సీపీ మూడు వార్డుల్లో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నగరి రూరల్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.