హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రి కొండపై శిథిల శివాలయం పరిశీలన

NTR: ఇంద్రకీలాద్రి కొండపై శిథిలావస్థలో ఉన్న పశుపతీశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించే యోచనలో దేవస్థానం ఉంది. ఆదివారం ఈవో వీకే సీనానాయక్, ట్రస్టు బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, అర్చకులు సుమారు 90 నిమిషాలు కొండ ఎక్కి ప్రధాన ఆలయాన్ని, రెండు రాతి నిర్మాణాలను పరిశీలించారు. నివేదికను దేవాదాయ కమిషనర్‌కు సమర్పిస్తామని, అనుమతుల మేరకు తదుపరి చర్యలుంటాయని ఈవో తెలిపారు.