VZM: జిల్లాను చలిపులి వణికిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రానున్న రెండు రోజులు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత


