VZM: రాజాంలోని సెయింట్ ఆన్స్ స్కూల్లో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కమిషనర్ రామచంద్రరావు ఆదివారం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటిగ్ ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్


