హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారాంపురం సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి

ELR: ఉంగుటూరు మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంగపండు సత్యనారాయణ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు ఆయన గెలుపును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.