హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాలకు అంకురార్పణ

KKD: శంఖవరం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అర్చకులు చదువుల సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో రేలంగి మాణిక్యాలరావు దంపతులు శాస్త్రోక్తంగా పందిరి రాట మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు నవధాన్యాలు సమర్పించి ప్రసాదాలు స్వీకరించగా.. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.