హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI ప్రిలిమినరీ పరీక్షలో 92% హాజరు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో SI ప్రిలిమినరీ పరీక్షలో 92%కి పైగా హాజరు నమోదైంది. సీపీ ఎన్. శ్వేత ఆదేశాలతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. మొత్తం 18,194 మంది దరఖాస్తులు చేసుకోగా ఆదివారం 16,782 మంది పరీక్షకు హాజరయ్యారు.