హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొత్తరెడ్డిపాలెంలో ఓట్ల గల్లంతుపై నిరసన

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలెంలో ఓట్ల వివాదం కలకలం రేపింది. తమ ఓట్లను ఇతరులు ముందుగానే వేసేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో 202 మంది ఓటర్లు ఉండగా, టెండర్ బ్యాలెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.