హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుములపల్లె సర్పంచ్‌గా భూలక్ష్మి విజయం!

ప్రకాశం: రాచర్ల మండలంలోని అనుములపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థి సిరిగిరి భూలక్ష్మి 229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారులు ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.