హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆర్వోను దూషించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి'

ATP: ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్వోను దూషించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పాల్గొని, ఆర్వోకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని కోరారు.