MBNR: అడ్డాకుల మండలం పొన్నాకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి రూ. 5 లక్షల ప్రొసీడింగ్స్ అందజేస్తామని ఆయన ప్రకటించారు. గ్రామాల్లో అన్ని వర్గాల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం


