హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో 3,01,358 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.129.88 కోట్ల నిధులు విడుదల చేసింది. సోమవారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి అదే రోజు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.