VKB: తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నూతనంగా నిర్మించిన శ్రీ ఊరడమ్మ, శ్రీ మైసమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
తెలంగాణ
వైభవంగా అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ


