హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొద్దిసేపే నీరు.. కాలనీవాసుల అవస్థలు

VKB: తాండూర్ మండలం నారాయణపూర్‌లోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు మాత్రమే నీరు వస్తుండటంతో తాగునీటి అవసరాలు తీరడం లేదంటున్నారు. అధికారులు స్పందించి క్రమం తప్పకుండా సరిపడా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.