హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: దేవన్న

GDWL: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మైభారత్ కోఆర్డినేటర్ దేవన్న సూచించారు. నషాముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయిజ మండలం మేడికొండలో సైకిల్ ర్యాలీ నిర్వహించి, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు వ్యసనాల జోలికి వెళ్లరాదని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.