ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము సర్పంచ్ ఎన్నికలో వైసీపీ మద్దతుతో పోటీ చేసిన 22 ఏళ్ల అవివాహిత నూపా ఇందుమతి విజయం సాధించారు. ఆమెకు 1,615 ఓట్లు రాగా, సమీప టీడీపీ మద్దతు అభ్యర్థికి 1,593 ఓట్లు వచ్చాయి. కేవలం 22 ఓట్ల తేడాతో గెలిచిన ఇందుమతి గ్రామ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. చిన్న వయసులోనే సర్పంచ్ కావడం విశేషంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
22 ఏళ్లకే సర్పంచ్‌గా గెలుపు


