ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా జంగం రెడ్డి గారి శైలజ ఘన విజయం సాధించారు. వైసీపీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆమె, ప్రత్యర్థిపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో గ్రామంలో ఆమె అనుచరులు, వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పలువురు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ శైలజకు అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా శైలజ ఘన విజయం


