హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు వేసేందుకు పడవ ప్రయాణం

ASR: అల్లూరి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పడవ ప్రయాణం చేశారు. ముంచంగిపుట్ మండలం సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్ గ్రామస్థులు మత్స్యగెడ్డను పడవలో దాటి, మరో నాలుగు కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ముంపు ప్రాంతాల్లోని తొమ్మిది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఇదే విధంగా ఓటు వేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు.