హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

విశాఖ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నాలుగు మండలాల్లో 65 సర్పంచ్, 559 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 14 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు.