కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 2 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా 95523 00009 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్‌తో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్


