VSP: పెందుర్తిలోని గౌరీ పరమేశ్వరుల ఆలయాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందిన పెందుర్తి అయ్యప్ప స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పెందుర్తిలో ఆలయాలను దర్శించుకున్న MLA


