BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఒకటో వార్డు అభ్యర్థిగా బరిలోకి దిగిన తిరుమలశెట్టి హనుమయ్య తన సమీప వైసీపీ అభ్యర్థి కూరేటి శ్రీనివాసరావుపై 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తోటవారిపాలెంలో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటూ పార్టీ జెండాను రెపరెపలాడించారు.
ఆంధ్రప్రదేశ్
తోటవారిపాలెం 1వ వార్డులో జనసేన జయకేతనం


