హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎస్‌హెచ్‌ఎం బసవరాజ్ పదవీ విరమణ అభినందన సభ

ఉమ్మడి జిల్లా రేగోడు మండలం లింగంపల్లి పీఎస్‌హెచ్‌ఎం బసవరాజ్ పదవీ విరమణ అభినందన సభ ఆదివారం నారాయణఖేడ్‌లో ఘనంగా జరిగింది. విద్యా రంగానికి ఆయన అందించిన సేవలను వక్తలు కొనియాడి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కిఫాయత్ అలీ, ఉపాధ్యక్షుడు విట్టల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.