హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే

భూపాలపల్లి రూరల్ మండలంలోని 13 గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం పర్యటించారు. మహిళా సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధి, మహిళా సంక్షేమం, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.