హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

వరంగల్ చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.