హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా మరుగుదొడ్లు .. ప్రయాణికుల అవస్థలు

KMR: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండులో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడంతోపాటు ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.