హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి

BDK: సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందించాలని సూచించారు. భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాలతో పాటు మండల పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.