హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కర్నూలు: కల్లూరు అర్బన్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయాన్ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ NDL జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, స్వామివారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.