హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయపాటి మృతి పట్ల ఎంపీ లావు తీవ్ర దిగ్భ్రాంతి

PLD: నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి పట్ల ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు ఎంపీ లావు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.