ఖమ్మం మంచికంటి హాల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన బీవీకే బాలోత్సవం సంబరాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు సభకు బీవీకే జనరల్ మేనేజర్ వై. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐక్యత, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
నేటితో ముగిసిన బీవీకే బాలోత్సవం


