అన్నమయ్య: చిట్వేలు మండలం తుమ్మకొండ నూతన సర్పంచ్ పుల్లగంటి భానుమతి, ఉపసర్పంచ్ పుల్లగంటి రెడ్డయ్య ఆదివారం తిరుపతిలో టీడీపీ సీనియర్ నాయకుడు కస్తూరి విశ్వనాథ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం భానుమతి, రెడ్డయ్యలను విశ్వనాథ నాయుడు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్టా గుండయ్య నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుమ్మకొండ సర్పంచ్, ఉపసర్పంచ్‌కు ఘన సన్మానం


