హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ సరసన ధ్రువ్‌

న్యూజిలాండ్ పర్యటనలో భారత యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా రెండు టెస్టుల్లోనూ అర్ధశతకాలు నమోదు చేశాడు. దీంతో కిరణ్ మోరె, ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుస టెస్టుల్లో హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. గతంలో 1990లో కిరణ్ మోరె, 2009లో ధోనీ ఈ ఘనత సాధించాడు.