హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు

కృష్ణా: కంకిపాడులో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారుల వ్యవహారశైలి, తీరుపై ఆదివారం విమర్శలు వ్యక్తమయ్యాయి. మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 7, 8, 9 పోలింగ్ కేంద్రాల వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల వేలిపై చెరగని సిరా గుర్తు సరిగా పడటం లేదని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.